NTV Telugu Site icon

IND vs SA: రాణించిన రాహుల్.. 245 పరుగులకు టీమిండియా ఆలౌట్..

Kl

Kl

IND vs SA: సెంచూరియన్ వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా-టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ చేసి టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కించాడు. కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 101 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టు స్కోరును 245 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. కేఎల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ మినహా ఇతర భారత బ్యాట్స్‌మెన్ యాభై పరుగుల మార్కును తాకలేకపోయారు.

Kota Bommali PS : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కోట బొమ్మాళి పీఎస్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

208/8 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఈరోజు 37 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. 238 పరుగుల స్కోరుపై టీమిండియాకు తొలి దెబ్బ తగిలింది. 22 బంతుల్లో 5 పరుగులు చేసి గెరాల్డ్ కోయెట్జీ వేసిన బంతికి మహ్మద్ సిరాజ్ ఔటయ్యాడు. ఆ తర్వాత.. కేఎల్ రాహుల్ నాంద్రే బెర్గర్ బంతికి పెవిలియన్ బాట పట్టాడు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ కు సౌతాఫ్రికా గడ్డపై ఇది రెండో సెంచరీ. దక్షిణాఫ్రికా తరఫున కగిసో రబాడ అద్భుత బౌలింగ్ చేశాడు. రబాడ 20 ఓవర్లలో 59 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. తొలి టెస్టు ఆడుతున్న నాండ్రే బెర్గర్ 3 వికెట్లు పడగొట్టాడు. మార్కో యూన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ తలో వికెట్ తీశారు.

Devil: డెవిల్ రిలీజ్ కి ముందు నవీన్ మేడారం బహిరంగ లేఖ.. అదేదీ నిజం కాదంటూ!

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. నిర్ణీత వ్యవధిలో భారత బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పట్టారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ 2 పరుగులు, విరాట్ కోహ్లీ 38, శ్రేయాస్ అయ్యర్ 31 పరుగులు చేశారు. అయితే ఇప్పుడు భారమంతా భారత బౌలర్లపైనే.. వారు సౌతాఫ్రికా బ్యాటర్లను ఎలా కట్టడి చేస్తారో చూడాలి.