NTV Telugu Site icon

IPL 2025 Mock Auction: ఐపీఎల్ మాక్ వేలంలో రికార్డ్ ధరలకు అమ్ముడుబోయిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్

Ipl 2025 Mock

Ipl 2025 Mock

IPL 2025 Mock Auction: నవంబర్ 24, 25 తేదీలలో జరగబోయే ఐపీఎల్ 2025 సీజన్ వేలం సంబంధించి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఐపిఎల్ లో ఆడే 10 ఫ్రాంచైజీలు వారి ఆటగాళ్లను రిటైన్ చేశాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ పైనే ఉంది. ఇకపోతే, ఐపీఎల్ వేలానికి ముందు అనేక ఛానల్లు మాక్ వేలం పాటలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే జియో సినిమాలో ఓ మాక్ వేలం నిర్వహించబడింది. ఇందులో రాబిన్ ఉతప్ప, సురేష్ రైనా, ఇయాన్ మోర్గాన్, మార్క్ బౌచర్ లాంటి వెటరన్ ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీల అధిపతులుగా కూర్చుని వేలం పాటను నిర్వహించారు.

Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ వేలంలో ఈ విదేశీ ఆల్ రౌండర్లపై కానక వర్షం కురవనుందా?

ఈ ఐపీఎల్ మాక్ వేలంలో రిషబ్ పంత్ పేరు బిడ్డింగ్ లోకి రాగానే బలమైన పోటో నెలకొంది. రూ. 30 కోట్ల రూపాయలు దాటిన కానీ.. చివరి వరకు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తీవ్రంగా శ్రమించి రూ. 33 కోట్ల అత్యధికంగా వేలంపాటలో పంజాబ్ కింగ్స్ రిషబ్ పంత్ ని కొనుగోలు చేసింది. మరోవైపు, ఇదే బిడ్డింగ్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ పై కూడా డబ్బులు వర్షం కురిసింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు అతని కోసం తీవ్రంగా శ్రమించాయి. దాంతో చివరికి కేఎల్ రాహుల్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 29.5 కోట్లకు వేలంలో దక్కించుకుంది. అయితే, ఇంత భారీ మొత్తంలో వీరిద్దరూ అమ్ముడుపోతారా లేదా అన్నది ఆదివారం జరిగే మెగా వేలంలో తేలనుంది.

Show comments