నేడు ఐపీఎల్‌లో రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్‌ను ఎంచుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్ ధావన్ 40 పరుగులు సాధించాడు.
Also Read : Kesineni Nani: పదవికే వన్నెతెచ్చే నేత వేపాడ చిరంజీవి
చివర్లో సామ్ కరన్ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్, షారుక్ ఖాన్ 7 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే.. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఓటమి దిశగా పయనిస్తోంది. 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 4 పరుగులు చేసిన రింకూ సింగ్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెంకటేశ్ అయ్యర్ 21 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
