NTV Telugu Site icon

KKR vs PBKS : తొలి వికెట్‌ను సమర్పించుకున్న కోల్‌కతా

Kkr

Kkr

నేడు ఐపీఎల్‌లో రెండో మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలింగ్‌ను ఎంచుకున్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్‌ ధావన్‌ 40 పరుగులు సాధించాడు. చివర్లో సామ్‌ కరన్‌ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్‌, షారుక్‌ ఖాన్‌ 7 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Also Read : Kane Williamson: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి కేన్ ఔట్

కేకేఆర్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 2 వికెట్లను తన ఖాతాలో వేసుకోగా.. వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌లు తలా ఒక వికెట్‌ను తీశారు. అయితే.. ఆ తరవాత కోల్‌కత్తా జట్టు నుంచి 179 పరుగల లక్ష్య ఛేదనకు దిగిన మనదీప్‌, గర్బాజ్‌లు మొదటి ఓవర్లో 13 పరుగులు రాబట్టారు. అయితే తరువాత అర్ష్‌దీప్‌ సింగ్‌ ఓవర్లో మొదటి బంతికే మన్‌దీప్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. అయితే.. తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన అన్ కుల్ రాయ్ సైతం అర్షదీప్‌ బౌలింగ్‌లోనే రెండో వికెట్‌ను సమర్పించుకున్నాడు. రెండు ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా స్కోర్‌ 17/2 గా ఉంది.

Also Read : Delhi Hit And Drag Case: యువతిని కారు ఈడ్చుకెళ్లిన కేసులో 800 పేజీల ఛార్జిషీట్ దాఖలు..