NTV Telugu Site icon

KKR vs PBKS : బాదుడే.. 10 ఓవర్లు పంజాబ్‌ స్కోరు ఎంతంటే..?

Pbks Vs Kkr

Pbks Vs Kkr

ఐపీఎల్‌-2023లో మరో ఆసక్తికర పోరుకు సమయం అసన్నమైంది. మొహాలీ వేదికగా రెండో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్‌ 16వ సీజన్‌ నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే.. నిన్న తొలి మ్యాచ్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడగా.. 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే.. ఇవాళ రెండు మ్యాచ్‌లు ఉండగా.. తొలి మ్యాచ్‌ కోల్‌కతా, పంజాబ్‌ జట్ల మధ్య జరుగుతోంది.

Also Read : Shivathmika: ఆ గ్యాప్‎లోనే ‘దొరసాని’కి అర్థమైందంట

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలింగ్‌ను ఎంచుకున్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 10 ఓవర్లలోనే జట్టు స్కోరు వికెట్‌ నష్టానికి వంద పరుగుల మార్క్‌ దాటింది. రాజపక్స 29 బంతులకు 46 పరుగులు, ధావన్‌ 21 బంతులకు 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే.. 23 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్‌ సింగ్‌ సౌథీ.. బౌలింగ్‌లో వికెట్‌ను సమర్పించి పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ స్కోర్‌ 100/1 గా ఉంది.

Also Read : Aishwarya Rajinikanth: ఐశ్వర్య పిసినారి.. జీతం పెంచలేదు.. అందుకే దొంగతనం

Show comments