NTV Telugu Site icon

Digvesh Rathi: అందుకే ‘నోట్‌బుక్’ సెలబ్రేషన్స్ చేసుకున్నా.. వీడియో వైరల్!

Digvesh Rathi Notebook Celebration

Digvesh Rathi Notebook Celebration

ఐపీఎల్ 2025లో వరుసగా రెండు మ్యాచ్‌లలో లక్నో సూపర్ జెయింట్స్‌ స్పిన్నర్ దిగ్వేశ్‌ రాఠి జరిమానా ఎదుర్కొన్నాడు. వికెట్‌ తీయగానే ‘నోట్‌బుక్‌పై సంతకం’ చేసినట్లుగా సెలబ్రేషన్స్ చేసుకోవడమే ఇందుకు కారణం. మొదటిసారి రూ.12 లక్షల జరిమానా పడగా.. రెండోసారి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా పడింది. అంతేకాదు అతడి ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా చేరాయి. ఇక కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో లక్నో మంగళవారం తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేసే సమయంలో తాను చేసుకునే సంబరాలపై రాఠి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

Also Read: Jasprit Bumrah: ‘హ్యాండిల్‌ విత్‌ కేర్’ సార్.. పొలార్డ్‌కు బుమ్రా ఫాన్స్ విన్నపం!

ప్రాక్టీస్ సమయంలో రిషభ్ పంత్, సునీల్ నరైన్, నికోలస్‌ పూరన్‌తో దిగ్వేశ్‌ రాఠి సందడి చేశాడు. బౌలింగ్‌లో తన మార్గదర్శి సునీల్ నరైన్‌కు రాఠిని నికోలస్‌ పూరన్ పరిచయం చేశాడు. అనంతరం పూరన్ మాట్లాడుతూ.. ‘నీ మార్గదర్శి నరైన్ వికెట్ తీసిన అనంతరం సంబరాలు చేసుకోడు. మరి నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు?’ అని రాఠిని అడిగాడు. ‘నేను ఢిల్లీ నుంచి వచ్చాను కాబట్టి సెలబ్రేషన్స్ చేసుకుంటా’ అని సమాధానం ఇచ్చాడు. దాంతో అందరూ నవ్వుకున్నారు. పంత్ మాట్లాడుతూ.. ‘రాఠి టికెట్ కలెక్టర్, నరైన్ వికెట్ కలెక్టర్. అందుకే రాఠి చెక్కులు రాస్తుంటాడు’ అని పేర్కొన్నాడు. ఈ వీడియోను కేకేఆర్ షేర్ చేసింది. ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లీ.. గతంలో నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే.