ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్తాన్. దీంతో.. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఆటగాళ్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేశారు. కోల్‌కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి 57 పరుగులు సాధించి అర్ధశతకంతో రాణించాడు. మిగిలిన వారిలో కెప్టెన్ నితీశ్ రాణా(22), రింకూసింగ్(16), రహ్మానుల్లా గుర్బాజ్(18) లు పర్వాలేనిపించగా జేసన్ రాయ్(10), రస్సెల్ (10) లు విఫలం అయ్యారు.
Also Read : Karnataka Elections: ఎందుకైనా మంచిది అంబులెన్సులు సిద్ధంగా చేసుకోండి.. కాంగ్రెస్‌పై బీజేపీ సెటైర్లు..
అయితే.. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్ రెండు, కేఎం ఆసిఫ్, సందీప్ శర్మ ఒక్కొ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ప్లే ఆఫ్ రేసు రసవత్తంగా మారిన నేపథ్యంలో కేకేఆర్, రాజస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ప్లే ఆఫ్ రేసులో ముందుంటుంది. అయితే రాజస్తాన్ గత 6 మ్యాచ్‌లో 5 ఓడిపోయింది. మరోవైపు కేకేఆర్ గత మ్యాచ్‌లో 4 మ్యాచ్‌లో మూడింటిల్లో మాత్రమే గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో రాజస్తాన్ 5, కేకేఆర్ 6వ స్థానంలో ఉన్నాయి.