NTV Telugu Site icon

KK Survey: కిక్కెకించిన ‘కేకే’ సర్వే.. కూటమి సునామీని బాగానే అంచనా వేసాడుగా..

Kk Survey

Kk Survey

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్డీఏ కూటమికి 150 పైగా సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసిన సంగతి తెలిసింది. అయితే ఈ విషయంపై చాలామంది జోకులు కూడా వేశారు. అసలు ఎవరు ఈ కేకే.. అతనికి తెలిసిన విషయాలు ఏంటి.. ఏ నమ్మకంతో ఇంతటి సర్వేలను ఇస్తున్నాడు.. అంటూ అనేక విమర్శలు అతనిపై వచ్చాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం ఆయన వేసిన అంచనాలే కచ్చితంగా నిజమైనవని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న లెక్కలు చూస్తే వైఎస్ఆర్సిపి కేవలం 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండగా.. కూటమి 160 స్థానాలకు పైగా ఆధిక్యంను కొనసాగిస్తుంది.

Shalini Ajith: అభిమానులకు అజిత్ భార్య వార్నింగ్… షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి షాలిని!

ఈ దెబ్బతో ప్రస్తుతం సోషల్ మీడియాలో కేకే సర్వే తెగ పాపులర్ అయిపోయింది. ఎవరు.. కేకే బ్రో నువ్వు.. అసలు నువ్వు ఇంత టాలెంటెడ్ అనుకోలేదు అంటూ ఆయనపై నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కొందరు వైస్సార్సీపీ వస్తుందని అంటుంటే.. కానీ నువ్వు మాత్రం టీడీపీ కూటమి కచ్చితంగా వస్తుందని., అది కూడా ఊహించని రేంజ్ లో కూటమి విజయం సాధిస్తుందని చెప్పడంతో ఇప్పుడు అది నిజం కావడంతో అతనిని పెద్ద ఎత్తున పొగడ్తలతో ఉంచేత్తుతున్నారు.

2024 Election Results: జోరు త‌గ్గిన బీజీపీ.. కానీ అధికారం దిశగా..

ఈయన సర్వేలో భాగంగా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నేరుగా బరిలోకి దిగిన 144 స్థానాలలో 133 స్థానాలను కైవసం చేసుకుంటారని తెలిపారు. అలాగే జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని కంఠపరంగా నొక్కి చెప్పాడు. అలాగే కూటమిలో మరో పార్టీ బిజెపి కూడా 10 స్థానాలకు ఏకంగా 7 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సిపి 155 స్థానాల్లో కేవలం 14 సీట్లు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పగా.. ప్రస్తుతం పరిస్థితి చూస్తే వైస్సార్సీపీ కేవలం 12 స్థానాల్లోనే సరిపెట్టుకునేలా కనబడుతుంది. దీంతో చివరికి ప్రతిపక్ష హోదా కూడా నిలబెట్టుకోలేకపోయింది వైస్సార్సీపీ. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీ 21 స్థానాలలో విజయం సాధించబోతున్నట్లు కనబడుతోంది.