తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాజా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని… కేసీఆర్ బీజేపీ పై అనేక విమర్శలు చేశారని మండిపడ్డారు. బీజేపీ పార్టీని భయపెట్టే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ భయపెట్టినంత మాత్రాన బీజేపీ పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ భయపడదని హెచ్చరించారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచి బియ్య సేకరిస్తోందని తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి. కేంద్రం తెలంగాణ నుంచి గత ఏడాది ధాన్యం సేకరించిందని… ప్రతీ ఏడాది కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల కోసమే కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
మీ తాటాకు చప్పుళ్లకు భయపడం : కేసీఆర్ కు కిషన్ రెడ్డి కౌంటర్
