NTV Telugu Site icon

Kishan Reddy : తన మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటిన కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ పిలుపు మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలోని తన నివాసంలో తన మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో మొక్కలు నాటుతు.. అమ్మను గౌరవించుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. మొక్క నాటిన అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలన్న ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందన్నారు.

మన జీవితంలో అమ్మ తర్వాతే అన్ని.. కాబట్టి అమ్మ నవమాసాలు మోసి పెంచిన అమ్మకు జ్ఞాపకంగా గుర్తుగా అమ్మ గౌరవనికి గుర్తుగా ప్రతి ఒక వ్యక్తి చెట్టు నాటలని అమ్మ గౌరవాన్ని పెంచాలన్నది ప్రధాని మోడీ ఆలోచన అన్నారు. అమ్మ మనల్ని ఎలా పెంచి పెద్ద చేసిందో అదే తరహాలో నాటిన మొక్కను కూడా సంరక్షించి పెద్దగా చేసే వరకు కాపాడి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యలు కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు అమ్మ ప్రేరణ కావాలి అమ్మే ఒక స్ఫూర్తి కావాలన్నది మోదీ ఆకాంక్ష కాబట్టి అందరూ మొక్కలు నాటాలన్నారు.

Vinesh Phogat: వినేశ్ ఫొగట్ అప్పీల్పై ఈరోజు రాత్రి తీర్పు..!

ప్రకృతి వైపరీత్యాలు.. మన పరిసరాలు కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్న తరుణంలో పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరం తీసుకోవాలని కోరారు. అడవులు తగ్గిపోతుండటం, పచ్చదనం కోల్పోతున్న తరుణంలో భవిష్యత్తుకు ఒక పెను సవాల్ లాంటిది భారతమాతను కూడా అమ్మలా భావిస్తాం భూమిని కూడా అమ్మలా భావిస్తాం కాబట్టి అమ్మ పేరుతో భారతమాతను భూమిని కాపాడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. దాంట్లో భాగంగానే మా అమ్మ పేరుతో తాను ఒక మొక్కను నాటారని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తన అమ్మ పేరుతో ఒక మొక్క నాటి పర్యావరణాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చెట్టు పెట్టడమే కాదు ఆ చెట్టును సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులకు సెలబ్రిటీలకు పారిశ్రామికవేత్తలకు అమ్మ పేరుతో మొక్క నాటలని పిలుపునిచ్చారు.

Mamata Banerjee: డాక్టర్ హత్యపై సీఎం కీలక వ్యాఖ్యలు.. అవసరమైతే నిందితుల్ని ఉరితీస్తామని ప్రకటన

ఇదిలా ఉంటే.. సుంకేశుల డామ్ కులడం పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ విలీనంపై మా పార్టీలో ఎటువంటి సంప్రదింపులు లేవని ఆయన వెల్లడించారు. మీడియా పేపర్ కథనాన్ని చూసా అని, అధ్యక్ష మార్పుపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని, పాక్ ఉగ్రవాదులు శాంతియుత పరిస్థితులు చెడగొట్టాలని చూస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఎన్నికల సంఘం జమ్మూకాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కు సిద్ధంగా ఉందని, జమ్మూకాశ్మీర్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.