Site icon NTV Telugu

Kishan Reddy: పూలే ఆశయ సాధన కోసం పని చేస్తాం..

Kishan Reddy Amberpet

Kishan Reddy Amberpet

Kishan Reddy: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. జ్యోతిరావు పూలే వారి భార్యతో కలిసి మహిళలకు విద్యనీ అందించారని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక స్కూల్స్ ఏర్పాటు చేశారని.. మహాత్మా గాంధీ తరువాత మహాత్మా అనే బిరుదుతో పిలుచుకునే వ్యక్తి జ్యోతిరావు పూలే అని ఆయన పేర్కొన్నారు. దేశంలో స్వాత్యంత్రం అనంతరం ఇప్పుడు బీసీ ప్రధాని ఉన్నారని.. పూలే ఆశయ సాధన కోసం పని చేస్తామని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: Rain Alert: తెలంగాణ ప్రజలకు చల్లటికబురు.. నేడు, రేపు తేలికపాటి వర్షాలు!

ఇవాళ గాంధీ నగర్, కవాడిగూడ డివిజన్‌లలో సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చిక్కడపల్లి బాపూ నగర్‌లోని రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ నుంచి కిషన్ రెడ్డి యాత్ర ప్రారంభం అయ్యింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు.

Exit mobile version