NTV Telugu Site icon

Kishan Reddy: ఎట్టకేలకు మౌనం వీడిన కిషన్‌రెడ్డి.. అధిష్టానం నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు జేపీ నడ్డా ఫోన్ చేశారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే.. నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అధ్యక్షునిగా పని చేసిన అనుభవం ఉందన్నారు. అలాగే.. తెలంగాణకు అధ్యక్షులుగా పని చేశాను.. అయితే పార్టీ మరోసారి నాపై ఈ బాధ్యత పెట్టింది.. బీజేపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచా.. పార్టీని ఎదీ ఎపుడు అడగలేదు అని కిషన్ రెడ్డి అన్నారు.

Read Also: Cricket: భారత–’A’ జట్టులో తెలుగు కుర్రాడు..

1980 నుంచి బీజేపీ పార్టీలో సైనికుడిగా పనిచేశాను.. పార్టీకి మించింది లేదు.. పార్టీనే నా శ్వాస.. వచ్చే శాసన సభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడమే మా లక్ష్యం అని కిషన్ రెడ్డి చెప్పారు. ఎలాగైనా గెలుస్తాం.. పార్టీ ముఖ్య నాయకులతో ఇవాళ రాత్రి మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నాడు. జూలై 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది.. వరంగల్ సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. వరంగల్ లో రైల్వే కోచ్ ల తయారీ కోసం యూనిట్ కావాలనే డిమాండ్ ఉంది.. నూట యాభై ఎకరాల్లో పరిశ్రమ రానుంది అని తెలిపారు.

Read Also: Ponnala: పార్టీలో ఓబీసీ లకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలి..

నెలకు రెండొందలు.. ఏడాదికి రెండు వేలు తయారీ చేస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్ మొదటి సారి నిర్వహిస్తున్నామన్నారు. భద్రకాళి దేవాలయాన్ని దర్శించుకోవాలని పీఎం మోడీని కోరుతున్నా.. అభివృద్ధి కార్యక్రమాల తర్వాత బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతారు.. 9న దక్షణ భారత రాష్ట్రాల ముఖ్య నాయకుల సమావేశం హైదరాబాద్ లో ఉంటుంది అని తెలిపారు. దక్షణాధిలో పార్టీ కార్యాచరణపై చర్చ జరుగనుందని ఆయన వెల్లడించారు.

LIVE : నాకు ఎలాంటి అలకా లేదు : Kishan Reddy Press Meet l NTV Live