Site icon NTV Telugu

Love Jihad in Telangana: తెలంగాణలో లవ్ జిహాదీ ఘటనలు పెరుగుతున్నాయి

Love Jihad

Love Jihad

ప్రేమ పేరుతో ఓ వర్గం లవ్ జిహాదీలకు పాల్పడుతోంది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. జక్రాన్ పల్లిలో ఓ దళిత యువతి పై హత్యాయత్నం చేయడం దుర్మార్గం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయి.. నేరస్తులకు అధికార పార్టీ అండగా నిలుస్తోంది అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో లవ్ జిహాదీ ఘటనలు పెరుగుతున్నాయి.. మజ్లీస్ పార్టీ మద్దతుతో ఒక సామాజిక వర్గం హిందూ, క్రిస్టియన్ యువతులను ట్రాప్ చేస్తోంది అని ఆరోపించారు. పేద మహిళలను వలలో వేసుకుని మోసం చేస్తున్నారు.. పథకం ప్రకారం అమ్మాయిలను ట్రాప్ చేసి హత్యలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

Read Also: ISRO Chief: రాకెట్లలో ఉపయోగించే విడిభాగాలు భారత్‌కు చెందినవే..

మజ్లీస్ పార్టీ లవ్ జిహాదీ లను ప్రోత్సహిస్తోంది అని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు ఇలాంటి కేసులను నీరుగారుస్తున్నారు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లవ్ జిహాదీ లను నిషేదించాము అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ, క్రిస్టియన్ యువతులే లక్ష్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు టార్గెట్ చేసి మరీ ట్రాప్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Australia: చైనా అతిపెద్ద సైన్యాన్ని నిర్మిస్తోంది.. ఆస్ట్రేలియన్ రాయబారి కీలక వ్యాఖ్యలు..

Exit mobile version