NTV Telugu Site icon

Kishan Reddy : ప్రధానమంత్రి ఆదేశాల ఆధారంగా మేం లక్ష్యాలు నిర్దేశిస్తాం

Kishan Reddy

Kishan Reddy

ఢిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్ ఆవరణలో MDOలతో జరిగిన వర్క్‌షాప్ లో పాల్గొని .MDOలకు స్టార్ రేటింగ్స్ అందజేశారు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి గారి ఆదేశాల ఆధారంగా మేం లక్ష్యాలు నిర్దేశిస్తామని, మీరు వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తారన్నారు. ఇది మొదటి ప్రయత్నం.. రానున్న రోజుల్లో రెండ్రోజులపాటు ఇలాంటి సమన్వయ సమావేశాలు నిర్వహించుకుందామని, మీరు లేవనెత్తుతున్న సమస్యలు.. అందరు ఎదుర్కొంటున్న సమస్యలు.. రానున్న రోజుల్లో.. దేశంలో ఎదురయ్యే పవర్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బొగ్గు లేకుండా విద్యుదుత్పత్తి సాధ్యం కాదని, బొగ్గు ఉత్పత్తిని పెంచేదిశగా మరింత కృషి జరగాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికుల సంక్షేమం, గనులకోసం భూములు వదిలి వెళ్తున్న వారందరి సంక్షేమం గురించి ఆలోచించాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

 Lubber Pandhu : తెలుగులోకి తమిళ్ సూపర్ హిట్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

MDOలు తమ ప్రాంతం నుంచి ఉద్యోగులను తెచ్చుకుంటామని అనుకోవద్దని, పర్మినెంట్ ఉద్యోగాలిస్తారా? కాంట్రాక్ట్ ఉద్యోగాలిస్తారా? మీ ఇష్టం కానీ స్థానికులకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, మానవత్వంతో MDO (మైన్ డెవలప్‌మెంట్ ఆపరేటర్స్)లు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు కిషన్‌ రెడ్డి. అదే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకెళ్లాలని, కోల్ బేరింగ్ ప్రాంతాల్లో కాలుష్యం విస్తరించకుండా.. అటవీకరణపై దృష్టిపెట్టాలన్నారు.

అంతేకాకుండా.’మైనింగ్ పూర్తయిన గనులను మూసి వేయడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. ప్రపంచంలో ఆదర్శవంతమైన విధానాలతో మైనింగ్, ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ పై దృష్టిపెట్టాలి. భాగస్వామ్య పక్షాలన్నీ దీనిపై ప్రత్యేక శ్రద్దతో పనిచేయాలి. ఇందుకోసం పూర్తి అంకితభావంతో పనిచేద్దాం. కోలిండియా ఏర్పాటై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భమిది. వచ్చే ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకోనున్నాం. ఈ 50 ఏళ్లలో కృషిచేసిన వారందరినీ గుర్తుచేసుకుంటూ ఏడాదిపాటు ఉత్సవాలు జరుపుకుందాం. గతేడాదితో పోలిస్తే.. మీ అందరి శ్రమతో బొగ్గు ఉత్పత్తి పెరిగింది. మోడీ ఆలోచనకు అనుగుణంగా.. వీలైనంతగా బొగ్గు దిగుమతులు తగ్గించుకుంటూ.. దేశీయంగా ఉత్పత్తిపై దృష్టి సారించాలి. ఒక్కరోజు ఉత్పత్తి ఆగినా.. తర్వాతి రోజు పేపర్లలో హెడ్ లైన్స్ వస్తాయి. అంటే సమాజం మనల్ని అంత నిశితంగా గమనిస్తోంది. భవిష్యత్ అవసరాలకోసం ఇవాళ్టినుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలి. అవసరమైన అన్ని అనుమతులను వీలైనంత త్వరగా ఇచ్చే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఉత్పత్తి పెంచేలా కృషిచేయాలి.

మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది. పవర్ కనెక్టివిటీ, రోడ్, రైల్ కనెక్టివిటీని పెంచేలా చర్యలు చేపట్టాలి. మీ సూచనలకు అనుగుణంగా.. నిబంధనలకు లోబడి పరస్పర సమన్వయంతో పనిచేద్దాం. అవసరమైన చోట నిబంధనలు మార్చాల్సి వస్తే.. దానికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవార్డు గ్రహీతలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరం కలిసి ఓ కుటంబంగా పనిచేద్దాం. బొగ్గు రంగానికి, బొగ్గు మంత్రిత్వ శాఖకు మంచిపేరు తీసుకొద్దాం. మన దేశానికి మంచిపేరు తీసుకొద్దాం.’ అని కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే, బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దత్, అదనపు కార్యదర్శులు, కోలిండియా చైర్మన్ పీఎం ప్రసాద్, వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, దేశంలోని వివిధ ప్రాంతానుంచి వచ్చిన MDOలు పాల్గొన్నారు.

Maharashtra Elections: సీట్ల పంపకాలపై కుదిరిన డీల్.. ఇండియా కూటమిలో ఎవరికెన్ని సీట్లంటే..!