Site icon NTV Telugu

Kishan Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తోంది

Kishan Reddy

Kishan Reddy

హైదరాబాద్‌ బంజారా లెక్ వ్యూ లో మన్ కీ బాత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని చట్టాలకు పాతర వేసి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మోసపూరిత పార్టీలు.. రెండు పార్టీలు దొందూ దొందే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పరిస్థితి లేదు, బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందని ఆయన అన్నారు. ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ గత పదేళ్లుగా మన్ కీ బాత్ నిర్వహిస్తున్నారని, అనేక సామాజిక సమస్యల మీద మోడీ మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. అమ్మను మించిన దైవం లేదు.. అమ్మ పేరు మీద ఒక మొక్కను పెట్టాలని మోడీ పిలుపునిచ్చారని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను పెట్టి భూమిని కాపాడాలని పిలుపు అని ఆయన అన్నారు.

Exit mobile version