Site icon NTV Telugu

Kishan Reddy : తెలంగాణలో కమీషన్ లేని కాంట్రాక్టులు లేవు… ఆ కుటుంబం దోచుకొని రంగం లేదు

Kishan Reddy

Kishan Reddy

ఘర్షణ వద్దని , ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలు భయపెడుతున్నారని, తెలంగాణ ప్రజలకు కావాల్సింది కల్వకుంట్ల స్వామ్యం కాదని ఆయన అన్నారు. నేషనల్ వాటర్ క్వాలిటీ సబ్మిషన్, రూరల్ వాటర్ డ్రింకింగ్ కింద 723 కోట్లు మంజూరు చేసిందని, మార్చ్ 2016 లో వాటర్‌ ప్యూరిఫికేషన్‌ ప్లాంట్స్‌ కోసం 95 కోట్లు ఇవ్వడం జరిగిందని, 2016, 17 లో కలిపి 800 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీల ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానం ఇది అని ఆయన స్పష్టం చేశారు. నీరాజనాలు వస్తే రాష్ట్రానికి, నీలాపనిందలు కేంద్రానికి అని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలు కుటుంబాన్ని వదిలి పెట్టే సమయం వచ్చిందని, తెలంగాణలో కమిషన్ లేని కాంట్రాక్ట్ లు లేవు… ఆ కుటుంబం దోచుకొని రంగం లేదని, తెలంగాణ ఉద్యమ కారులను వెన్నుపోటు పొడిచారన్నారు. రిటర్నింగ్ అధికారి మీద ఒత్తిడి తెచ్చారు కోర్ట్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని, కేసీఆర్‌ ఇష్టంతో గుర్తుల కేటాయింపు జరగదు… దానికి ఓ పద్ధతి ఉంటుందని, కల్వకుంట్ల మాఫియా రాజ్యంగా తెలంగాణను మారుస్తున్నారన్నారు. ట్విట్టర్ పోస్టింగ్ లకు కూడా ఓ లిమిట్ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version