NTV Telugu Site icon

Kishan Reddy : వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ఆరు గ్యారెంటీలు తుంగలో తొక్కింది…

Kishan Reddy

Kishan Reddy

జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల జీవితాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెంక మీది నుండి పొయ్యలో పడ్డట్టయిందని ఆయన అన్నారు. నిజాం రాజ్యం లాగా బిఆర్ఎస్ పరిపాలన చేసింది, కాంగ్రెస్ పరిపాలన కూడా అలాగే ఉందని, వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ఆరు గ్యారెంటీలు తుంగలో తొక్కిందన్నారు కిషన్‌ రెడ్డి. అన్ని విధాల నమ్మపలికి నట్టేట ముంచిందని, దేవుడి పేరుమోద ఓట్లు తింటూ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడన్నారు కిషన్‌ రెడ్డి. 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని ఆగస్టు వరకు వాయిదా వేశారని ఆయన మండిపడ్డారు. క్వింటాలు ధాన్యం పై 500 రూ”ఇస్తామని సన్నరకం ధాన్యానికి ఇస్తామని నమ్మబలికారని, రాష్ట్ర ప్రభుత్వం బోనస్ నుండి తప్పించుకుని రైతులకు అన్యాయం చేయాలని చూస్తుందని కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

అంతేకాకుండా..’తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది… క్వింటాల్ కు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం… దేశంలో ఎక్కడ లేని వధంగా కరువు భత్యం ఇవ్వడంలో బిఆర్ఎస్ అవలంభించిన తీరే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది… తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ముందునుగి వెనుక గొయ్యిల తయారైంది… కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గర్వభత్యాలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇవ్వడం లేదు… పెన్షనర్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది… ఎలాంటి అవగాహన లేకుండా గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది…

గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడానే లేదు… ఐదువేల కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్ మెంట్ పెండింగ్ లో ఉండటం వల్ల పేద విద్యార్థులు పై చదువులు చదువుకోవడం లేదు… ధనిక రాష్ట్రం గా పేరున్న తెలంగాణ,మిగులు బడ్జెట్ ఉండే తెలంగాణ ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వచ్చింది… తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది… తెలంగాణ భవిష్యత్తులో అంధకారంలో ఉండే అవకాశంలో ఉంది… తెలంగాణ ను రక్షించుకొనేందుకు మరో ఉద్యమం తప్పదు… కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీల DNA లు రెండు ఒకటే… పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్,బీఆర్ఎస్ కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి.’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.