కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ నీ, రాజ్యాంగాన్ని ఏ విధంగా అవహేళన చేసిందో మోడీ ప్రజల ముందు పెట్టారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. వారం రోజులు నుండి రేవంత్ రెడ్డీ కి ఏమయిందో ఏమో కానీ ఆయన వ్యవహార శైలి ఆందోళన కరంగా ఉందన్నారు. అయన నిజస్వరూపం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, రేవంత్ రెడ్డి పరిస్థితి దిగజారింది.. అపరిపక్వంగా , అహంకారం తో మాట్లాడుతున్నారన్నారు. సీఎం గాడిదలో కూడా గుడ్లు సృష్టించాడని, 5 నెలల పాలన లో నేను మీకు ఇచ్చేది ఇదే అని గాడిద గుడ్డు ను చూపిస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. నిన్నటివరకు రాజ్యాంగం అని తిరిగాడు… నిన్నటి నుండీ గాడిద గుడ్డు అంటూ ఊరేగుతున్నాడని, కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ లో కూడా భూమి కదిలి పోతుందన్నారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా.. ‘హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేసి పెట్టాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం లో రేవంత్ రెడ్డి పాల్గొన్నావా.. తెలంగాణ గురుంచి మాట్లాడే నైతిక హక్కు లేదు.. ఇక్కడ మేము ఉన్నాము మేము చాలు.. మీ అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము పోరాటం.. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ నే విదేశీ… INC అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్… కేసీఆర్ తో పోటీ పడుతున్నారు . నాకు నీవు నీకు నేను… ఇద్దరం కలసి బీజేపీ మీద పడదాం అని అనుకుంటున్నారు.. ఢిల్లీకి షూట్ కేస్ లు పంపుతున్నారు… ఫేక్ వీడియో ల సృష్టి లో మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డే.. ఈ కేసులో ఎవరు ఉన్న వదిలే ప్రసక్తే లేదు… కోర్ట్ లో కేసు వేస్తాం… బాధ్యులు జైలు ఊచలు లెక్కించాల్సిందే. సీఎం స్థాయి వ్యక్తి వీడియో మార్ఫింగ్ కు పాల్పడడం సిగ్గుచేటు.. టెలిఫోన్ ట్యాపింగ్, వీడియో మార్ఫింగ్ రెండు నేరాలే… ప్రజల నుండి బీజేపీ కి వస్తున్న ఆదరణకు ఈ రెండు పార్టీ లు బెంబేలు ఎత్తుతున్నాయి. మాకు తెలంగాణ ప్రజలు రక్షణ కవచం. ఈ రెండు పార్టీ లకు తెలంగాణ గడ్డ మీద పాతర వేయడం ఖాయం… కేసీఆర్ కాంగ్రెస్ పై మాట మార్చాడు… ఓటుకు నోటు కేసులో మీరు మాకు సపోర్ట్ చేశారు… మీ హయం లో జరిగిన వాటికి మేము సపోర్ట్ చేస్తాం అని ఒక ఆవగాహనకి వచ్చారు..
డూప్ ఫైటింగ్ చేసుకుంటున్నారు… రాజకీయ డ్రామా సమాంతరంగా నడుస్తుంది.. రేవంత్ రెడ్డి కి సవాల్ కాకమ్మ కబుర్లతో కాలక్షేపం చేయకు… నువ్వేమీ గొప్ప నాయకుడు వి అనుకుంటున్నావు .. నీ వల్లనే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందని అనుకుంటున్నావు.. కేసీఆర్ పాలనకు, ఆయన దుర్మార్గాన్ని కి వ్యతిరేకంగా ఓటు వేశారు … తప్ప నిన్నో , రాహుల్ గాంధీ నీ చూసొ వేయలేదు.. యూపీఏ హయం లో తెలంగాణ కు ఏమిచ్చింది.. ఎన్డీఏ పాలన లో మేము ఏమిచ్చమో చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి.. గాడిద గుడ్డు ను నెత్తిన పెట్టుకొని తిరగడం కాదు… 10 సంవత్సరాలు గా కెసిఆర్ కారణంగా తెలంగాణ కు అన్యాయం జరిగింది.. ఈ గాడిద గుడ్డు పార్టీ , గాడిద గుడ్డు నేతలకు తెలంగాణ కు బీజేపీ ఏమిచ్చిందో ప్రజల ముందు పెడుతున్నా..’ అని కిషన్ రెడ్డి అన్నారు.
