మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల సంగతి అతీగతీ లేదని, పక్క రాష్ట్రంలో 15 లక్షల ఇళ్లు కట్టారన్నారు. పార్టీ ఆఫీస్ లకు స్థలం ఉంటుంది తప్ప పేద ప్రజలకు ఇళ్లకు ఇవ్వడానికి ఉండదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కంటోన్మెంట్ లో 10 ఎకరాలు ఈ ప్రభుత్వం ఇచ్చిందని, 11 ఎకరాలు తమ పార్టీ కి కేటాయించకుందన్నారు.
Also Read : Menthikura Chicken : మెంతికూర చికెన్ ను ఇలా తయారు చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..
కానీ.. సైన్స్ సిటీ కు మాత్రం స్థలం ఇవ్వరంటూ చురకలు అంటించారు. వరంగల్ లో సైనిక్ స్కూల్ నీ అటకెక్కించారని, మెట్రో ఎక్కడ వరకు ఉండాలని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. పాత పట్నంలో ఎందుకు నిర్మించలేదని, ఎస్సీ విద్యార్థులు అకౌంట్స్ లో డబ్బులు వేస్తామని అంటే… గత పది నెలలు గా విద్యార్థులకు అందకుండా ఈ ప్రభుత్వం చేస్తుందని, ఆ డబ్బులు ప్రగతి భవన్ కి ఇవ్వండి మేము ఇస్తామని అంటున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబానికే దశాబ్ది ఉత్సవాలు.. తెలంగాణ ప్రజల కు కాదని ఆయన విమర్శించారు.
Also Read : Anirudh Ravichander: క్రేజ్ ను గట్టిగా వాడుతున్న అనిరుద్..హీరోలతో సమానంగా రెమ్యునరేషన్?
21 రోజుల పాటు ఈ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసిందని, బంగారు తెలంగాణ ఒక కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే అయిందన్నారు. రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయిందని, విద్యా దినోత్సవం జరిపే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు.. విశ్వ విద్యాలయాలు కళావిహీనంగా తయారు అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 9 ఏళ్లుగా డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ ల్లో పోస్టు లు ఖాళీగా ఉన్నాయి.. 15 వేల టీచర్ పోస్ట్ లు ఖాళీగా ఉంటే… అయన సంబరాలు జరుపుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి.