75 యేళ్ళుగా మహిళా రిజర్వేషన్ పై నేతలు ఆలోచించే స్థాయిలోనే ఉండిపోయారని, మోడీ ప్రధాని అయ్యాక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోధం పొందిందన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. దేశంలో మహిళలకు 75 యేళ్ళుగా మోసపోతూనే ఉన్నారని, కొత్త పార్లమెంట్ భవన్ లో మహిళా బిల్లు ఆమోదం పొందినoదుకు సంతోషంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. మోడీ పాలనలో దేశంలో అన్ని రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన మహిళలను వెనకబాటుకు గురి చేసిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో 11 వేల కోట్ల టాయిలెట్లు నిర్మించిన ఘనత మోడీది ఆయన కొనియాడారు.
Also Read : Lioness Dies Of Heart Attack: గుండెపోటుతో సింహం మహేశ్వరి మృతి
అంతేకాకుండా.. ‘తొమ్మిదేళ్ళ కేసీఆర్ పాలనలో ఒక్క మహిళా మంత్రి లేరు.. మొదటి ఐదేళ్ల కెసిఆర్ పాలనలో మహిళలకు స్థానమే లేదు.. కేసీఆర్ గురువు అసద్దుదీన్ ఒవైసీ.. గురువు చెప్పినట్టు శిష్యుడు కేసీఆర్ తల ఊపుతున్నాడు… మజ్లిస్ పార్టీ మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించింది.. తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ మహిళకు క్షమాపణలు చెప్పాలి… మహిళా బిల్లుకు ఓటు వేయకుండా పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ఎంపీలు పారిపోయిండ్రు.. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా… నరేంద్ర మోడీ పాలనను మరోసారి భలపర్చండి.. పదేళ్ల పాలనలో ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా పాలించిన ఘనత మోడీది.. పేద కుటుంబo నుంచి వచ్చిన వ్యక్తి మోడీ.. నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోంది.. తెలంగాణ మహిళలంతా మోడీకి అండగా నిలవాలి.. 1 న ప్రధాని మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు.. మహిళలంతా పెద్ద ఎత్తున తరలి రావాలి… మోడీకి ధన్యవాదాలు తెలిపేందుకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు మహిళలు కదిలి రావాలి…’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Himanta Biswa Sharma: నా ముందు నిలబడే ధైర్యం రాహుల్ గాంధీకి లేదు.. అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు