NTV Telugu Site icon

Kishan Reddy : తెలంగాణ ప్రజల భవిష్యత్ కల్వకుంట్ల కుటుంబం డైనింగ్ టేబుల్ మీద డిసైడ్ అవుతుంది

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణ ప్రజల భవిష్యత్ కల్వకుంట్ల కుటుంబం డైనింగ్ టేబుల్ మీద డిసైడ్ అవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి వస్తే కల్వకుంట్ల ప్రగతి భవన్ నీ ప్రజా ప్రగతి భవన్ గా మారుస్తామన్నారు. అవినీతి పాలన పోవాలి అంటే బీజేపీ అధికారం లోకి రావాలని, హైదరాబాద్ లో మాఫియా రాజ్యం నడుస్తుందన్నారు కిషన్‌ రెడ్డి. అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారన్నారు. మూసీ మీద రోడ్లు కాదు ముందు మూసి కబ్జాకు గురికాకుండా చూడండని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే. ఇటీవల కిషన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటన ప్రకారం మిషన్ భగిరథ రెండో దశలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాల్లో నీటి సరఫరా కోసం రూ. 200 కోట్లు.. ఎమ్ఎల్‌డీ-ఎస్‌టీపీల నిర్మాణం కోసం మరో రూ. 200 కోట్లు.. కోట్లు.. వరంగల్, కరీంనగర్ అభివృ‌ద్ధి కోసం 200 కోట్లు.. ఎమ్ఎమ్‌టీఎస్ రెండో దశ కోసం రూ.100.. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని టీచించ్ హాస్పిటల్ కోసం రూ.75 కోట్లు.. ఇలా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 50 ఏళ్లకు వడ్డీ లేని రూ. 2102 కోట్ల రుణం అందించింది.

ఇంకా, రూ. 26 వేల కోట్ల ఖర్చుతో నిర్మించబోతున్న 350 కి.మీల ఆర్‌ఆర్‌ఆర్‌ రోడ్డు రాష్ట్రంలోని చాలా జిల్లాలను అనుసంధానం చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు వివరాలన్నీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి అందించామని, రూట్ విషయంలో 99 శాతం ఆమోదం లభించిందని.. భూసేకరణ ఖర్చులో 50 శాతం కేంద్రమే భరించేందుకు అంగీకరించిందని తెలిపారు.