NTV Telugu Site icon

Kishan Reddy : వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం కనీస మద్దతు ధర పెంచింది

Kishanreddy

Kishanreddy

వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం కనీస మద్దతు ధర పెంచిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో పండించే వరి మద్దతు ధర కూడా పెరిగిందని, పత్తి పంట పై ఒకే సారి 500 పెంచిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల భర్తీ విషయం లో ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని ఆయన మండిపడ్డారు. జాబ్ కాలెండర్ ను అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు బహిరంగ సభల్లో మాట్లాడారని, తెలంగాణ తల్లి గా హామీ ఇస్తున్నా అని సోనియా గాంధీ ప్రతి ఇంటికి లేఖ పంపించిందన్నారు. వాళ్ళిచ్చిన గ్యారంటీ లకు గ్యారంటీ లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థినులకు స్కూటి లు ఇస్తామన్నారు .. నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ధర్నా చేస్తున్న మా యూత్ వింగ్ నేతల పై పోలీస్ లు కక్ష పూరితంగా ఉన్నాయన్నారు.

 

సింగరేణి పై విచిత్ర, వితండ వాదన బీఆర్‌ఎస్‌ వినిపిస్తుందని, సింగరేణి నీ ధ్వంసం చేసింది బీఆర్‌ఎస్‌ అని ఆయన అన్నారు. దేశం లోనే మంచి ప్రభుత్వ రంగ సంస్థ అని, బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్ కుటుంబం సింగరేణి నీ దివాలా తీసే పరిస్థితి అని, సింగరేణి నీ దెబ్బతీయాలని కెసిఆర్ కుటుంబం కంకణం కట్టుకుందన్నారు. ఓపెన్ యాక్షన్ ద్వారా అయితే సింగరేణి కి లాభం… నామినేషన్ ద్వారా అయితే నష్టమన్నారు కిషన్‌ రెడ్డి. నీట్ మీద దురుద్దేశం కేంద్రానికి లేదన్నారు. పేపర్ లీకేజ్ కాలేదని, నీట్ విషయం లో విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు. మరింత సమర్థ వంతంగా నిర్వహిస్తామని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.