Site icon NTV Telugu

Kishan Reddy : ఎవరు అధికారంలో ఉంటే అసద్దుద్దీన్ వాళ్ల పంచన చేరుతాడు

Kishan Reddy Amberpet

Kishan Reddy Amberpet

కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో మభ్య పెట్టిందని, కేసీఆర్ డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం అన్నాడు కానీ అయ్యనొక్కడే ఇల్లు కట్టుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కూడా ఇళ్లు ఇస్తామంది కానీ ఇంకా జరగలేదన్నారు. భారతీయ ఆత్మ దేవాలయాలని, ఆదర్శ వ్యక్తి రాముడు.. ఇప్పుడు ఆయనకు గుడిని నిర్మించుకున్నామన్నారు కిషన్‌ రెడ్డి. రామ భక్తుడిగా మోడీ రాముడి దేవాలయాన్ని నిర్మించారని, ఇప్పుడు 302 సీట్లు ఉన్నాయి.. ఈ సారి 400 దాటుతాయన్నారు. కాంగ్రెస్ కు 40 సీట్లు ఉన్నాయి.. ఇప్పుడు అవి కూడా వస్తాయో లేదో అని ఆయన అన్నారు. ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కనిపించడని, 2019 ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ మూడు నెలలు కనబడలేదన్నారు. తెలంగాణను దోచుకుంది కానీ ఢిల్లీలో దోచుకుందాం అనుకున్నారని, ఢిల్లీ లో కేసీఆర్ కూడా కవిత లిక్కర్ బీర్ వ్యాపారం చేద్దాం అనుకుందని, ఇప్పుడు కవిత ఎక్కడ ఉంది.! తీహార్ జైల్లో ఉందన్నారు. కేసీఆర్ ఇప్పుడు ఫాం హౌజ్ లో ఉన్నాడు.. ఇంకా పూర్తిగా అక్కడే ఉంటాడని ఆయన విమర్శించారు.

అంతేకాకుండా..’హైదరాబాద్ లో ఎంఐఎం గెలవాలని కాంగ్రెస్ కోరుతుందని వాళ్ల నాయకుడు ఫిరోజ్ ఖాన్ అన్నారు.. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల పంచన చేరుతాడు అసద్దుద్దీన్ ఓవైసీ.. మేము మహిళను నిలబెట్టగానే అసదుద్దీన్ బయపడ్డాడు.. సోనియా గాంధీ కాళ్లు మొక్కి నాకు మద్దతు ఇవ్వాలని కోరాడు.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు కూడా ఎంఐఎం పర్మిషన్ తీసుకునే ఓల్డ్ సిటీకి వెళ్లేవారు.. బీఆర్‌ఎస్‌ ఉన్నప్పుడు కూడా ఓల్డ్ సిటీకి వెళ్లాలంటే ఓవైసి దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళేవారు.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే చేస్తుంది.. కాంగ్రెస్, BRS, ఎంఐఎం మూడు పార్టీల DNA ఒక్కటే..’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version