NTV Telugu Site icon

Kishan Reddy: కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి డుమ్మా..! త్వరలో పదవికి రాజీనామా..?

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తారా? అనిపిస్తోంది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగతున్న సమావేశానికి కూడా కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో సర్వత్రా పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోసారి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిణామాల్లో భాగంగా కిషన్ రెడ్డికి అగ్రనాయకత్వ పగ్గాలు అప్పగించారు. దీంతో కిషన్ రెడ్డి ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం కేంద్ర బీజేపీ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ ప్రకటన వెలువడగా.. ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు సమాచారం.

Read also: Harish Rao: అది నోరా మొరా.. రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్

కేంద్ర మంత్రి పదవిలో ఉంటూనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చూడటం కష్టం. ఒకవైపు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను చూస్తూనే మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా నేతలను సమన్వయం చేస్తూ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించాల్సి వస్తోంది. రెండు బాధ్యతలను గారడీ చేయడం కష్టంగా మారుతుంది. అందుకే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో బండి సంజయ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తే ఆ శాఖ బాధ్యత మరొకరికి అప్పగిస్తారు. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగనుంది. ఈ భేటీ తర్వాత మంత్రివర్గంలో మార్పులపై స్పష్టత రానుంది. ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో మోడీ పర్యటిస్తున్నారు. దీంతో 9వ తేదీ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని టాక్.
CM YS Jagan: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. ప్రధాని మోడీతో చర్చించే అంశాలు ఇవే!