NTV Telugu Site icon

Kishan Reddy: భూములు అమ్మితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు..

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు, ఆయన సతిమణి దీపా వికాస్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర తగ్గిస్తే.. కల్వకుంట్ల కుటుంబం అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ ఎంపీ అధిర్‌ రంజన్ చౌదరి సస్పెన్షన్‌ ఎత్తివేత

పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించమని కోరితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదు అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పెట్రోల్ ధర అత్యధికంగా తెలంగాణలోనే ఉంది అని ఆయన ఆరోపించారు. తెలంగాణలో అన్ని ఛార్జ్ లను ఈ ప్రభుత్వం పెంచింది.. భూములు అమ్మితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: BJP: మోడీ @ ది టెర్మినేటర్.. 2024లో మళ్లీ నేనే..

కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆసరా పింఛన్లు ఇచ్చి.. బీర్ బ్రాందిల మీద తీసుకుంటున్నాడు.. బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఒప్పందం కుదుర్చుకునీ భూములు తీసుకున్నాయని ఆయన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలుస్తాయని జోస్యం చేప్పారు. గతంలో ఈ రెండు పార్టీలు కలిసి పని చేశాయి.. బడుగు బలహీన వర్గాలు కోరుకుంటున్న ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యం అంటూ కేంద్ర మంత్రి చెప్పారు. యువత, విద్యా వంతులు బీజేపీలోకి రావాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను అని కిషన్ రెడ్డి అన్నారు.