Kishan Reddy: తెలంగాణలో జర్నలిస్టుల అక్రమ అరెస్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభమైన జర్నలిజం పట్ల, జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికమని తెలిపారు. ఓ న్యూస్ రిపోర్ట్ విషయంలో తలెత్తిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 8 మంది సభ్యుల స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (SIT) ఇంకా విచారణ జరుపుతూనే ఉందని.. ఇంతలోపే రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి, ఇంటి తలుపులు ధ్వంసం చేసి వారిని అరెస్టు చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. విచారణ పూర్తయ్యాక, తప్పొప్పులు పరిశీలించి చర్యలు తీసుకోవాలి. కానీ.. ఇలా ముందుగానే అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నమ్మకం లేదా? లేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా? అని నిలదీశారు. అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా సిట్‌తో విచారణ జరిపించాలి. అంతే తప్ప జర్నలిస్టులను బెదిరించే, భయపెట్టే చర్యలకు పాల్పడకూడదని డిమాండ్ చేశారు.
READ MORE: NTV Journalists Arrest: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను తీవ్రంగా ఖండించిన ఏపీయూడబ్ల్యూజే..
