Site icon NTV Telugu

Kishan Reddy : కిషన్‌ రెడ్డి అరెస్ట్‌.. ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్తత

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్‌ వద్ద 24 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కిషన్‌ రెడ్డికి మద్దతుగా తరలివచ్చిన ఇతర బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘మా అరెస్ట్ మీ పతనం కేసీఆర్’ అని అరెస్ట్ చేసిన తర్వాత కిషన్‌ రెడ్డి ట్వీట్ చేశారు.

Also Read : I.N.D.I.A. First Meeting: ‘ఇండియా’ తొలి వ్యూహాత్మక భేటీ.. కీలక నిర్ణయం

అయితే.. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకే బీజేపీ దీక్షకు అనుమతి ఉందని.. దీంతో దీక్షను విరమించుకోవాలని పోలీసులు కిషన్ రెడ్డిని కోరారు. కానీ రేపటి వరకు దీక్ష చేస్తామని పోలీసులకు కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. దీక్ష కొనసాగిస్తానని భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ అనుమతి ఇచ్చిన సమయం అయిపోయిందని పోలీసులు కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి ఆయనను అరెస్టు చేశారు పోలీసులు. దీంతో ఇందిరా పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు, కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తన దీక్ష కొనసాగుతుందన్నారు. శాంతియుత దీక్ష వల్ల పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

Also Read : Kishan Reddy : రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా దీక్ష కొనసాగుతుంది

Exit mobile version