Site icon NTV Telugu

Kishan Reddy : లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జులను నియమించిన బీజేపీ

Kishanreddy

Kishanreddy

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి సోమవారం నియమించారు. లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లుగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎ.వెంకట్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

  1. ఆదిలాబాద్ – పాయల్‌ శంకర్
  2. పెద్దపల్లి – రామారావు పాటిల్
  3. కరీంనగర్ – సూర్యనారాయణ
  4. నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి
  5. జహీరాబాద్ – కాటిపల్లి వెంకటరమణారెడ్డి
  6. మెదక్ – పాల్వాయి హరీశ్‌ బాబు
  7. మల్కాజిగిరి – పైడి రాకేశ్‌ రెడ్డి
  8. సికింద్రాబాద్ – కె.లక్ష్మణ్
  9. హైదరాబాద్ – రాజాసింగ్
  10. చేవెళ్ల – ఏవీఎన్ రెడ్డి
  11. మహబూబ్‌నగర్ – రామచంద్రరావు
  12. నాగర్‌కర్నూల్ – మాగం రంగారెడ్డి
  13. నల్లగొండ – చింతల రామచంద్రారెడ్డి
  14. భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
  15. వరంగల్ – మర్రి శశిధర్‌రెడ్డి
  16. మహబూబాబాద్ – గరికపాటి మోహనరావు
  17. ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి
Exit mobile version