Site icon NTV Telugu

TS BJP: రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ ను పరిశీలించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్

Bandi,kishan

Bandi,kishan

బీజేపీ రాష్ట్ర అధ్యక్షున్ని మారుస్తారనే వార్తల నేపథ్యంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకోనుంది. ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి ఓకే వేదిక మీద కలువనున్నారు. ఈనెల 8వ తేదీన ప్రధాని మోడీ హన్మకొండకు రానున్న నేపథ్యంలో బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం బీజేపీ రాష్ట్ర శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల రాష్ట్రంలో బీజేపీ పార్టీ గ్రాఫ్ తగ్గిపోయిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మోడీ పాల్గొనే సభకు ప్రాధాన్యం సంతరించుకున్నది.

Read Also: Allu Arjun: అనౌన్స్మెంట్ వచ్చేస్తోంది… ఈసారి పాన్ ఇండియా లెవల్లో

కాజీపేట అయోద్యపురం వద్ద రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ కు ఈనెల 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేయనున్నారు. వర్క్ షాప్ శంఖుస్థాపన ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ పరిశీలించారు. దక్షిణమద్య రైల్వే అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ ను అప్ గ్రేడ్ చేస్తూ వ్యాగన్ తయారు యూనిట్ గా కేంద్రం మార్చనున్నారు.

Read Also: Husband Attack Wife: దారుణం.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే..?

వర్క్ షాప్ కోసం గత ఫిబ్రవరి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 160 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. గత 40 ఏళ్ళుగా నినాదంగా మారిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. రాష్ట్ర విభజన చట్టంలోని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ.. నెరవేరని హామీఫై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శల నేపథ్యంలో కేంద్ర సర్కార్ మెట్టుదిగింది. కోచ్ ఫ్యాక్టరీ బదులు వ్యాగన్ మ్యానుప్యాక్షరింగ్ వర్క్ షాప్ గా సెంట్రల్ సర్కార్ మార్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా బీజేపీ ప్రకటన చేయించనుంది.

Read Also: Mouse: ట్రాఫిక్‌ను స్తంభింపజేసిన ఎలుకలు.. గంటలపాటు ఇబ్బంది పడ్డ నగరవాసులు

మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆయనపైన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి వరంగల్ లో నేడు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభ సక్సెస్ చేయడంపైనా, సభకు చేయాల్సిన ఏర్పాట్లపైనా, జన సమీకరణపైనా వీరు చర్చించనున్నారు. ఈపరిణామం కాషాయ శ్రేణుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ఎడమొహం, పెడమొహంగా ఉన్న బండి, ఈటల ఒకే వేదిక మీదకు హాజరుకావడంపై పార్టీలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి.

Exit mobile version