Allu Arjun: అనౌన్స్మెంట్ వచ్చేస్తోంది… ఈసారి పాన్ ఇండియా లెవల్లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిన అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా అనగానే అందరికీ ‘జులాయి’ గుర్తొస్తుంది. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో జులాయి సినిమాలో కనిపిస్తుంది. ది బెస్ట్ హీరో అండ్ విలన్ ట్రాక్ ని ఇచ్చిన ఈ హీరో డైరెక్టర్ కాంబినేషన్, ఇప్పటివరకూ మూడు సినిమాలు చేసి మూడు సార్లూ హిట్ కొట్టారు. ముఖ్యంగా ఈ కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అల్లు అర్జున్ ని ఫ్రెష్ గా చూపించడంలో, అల్లు అర్జున్ కామెడి టైమింగ్ ని పర్ఫెక్ట్ గా వాడుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే ఈ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఫాన్స్ ని డిజప్పాయింట్ చేయవు. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా మొదలు పెట్టే ప్రాసెస్ లో ఉన్న అల్లు అర్జున్, ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే మరోసారి మాటల మాంత్రికుడితో కలవడానికి రెడీ అవుతున్నాడు.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో నాలుగో సినిమాకి గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. మహేశ్ తో త్రివిక్రమ్ చేస్తున్న #ssmb28 సినిమా షూటింగ్ ఇటివలే మొదలయ్యింది. ఈ సినిమా షూటింగ్ మార్చ్ లోపు మిగించి సమ్మర్ బరిలో నిలబెట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మహేశ్ బాబుతో సినిమా పూర్తవ్వగానే అల్లు అర్జున్ సినిమాని మొదలుపెట్టనున్నాడట త్రివిక్రమ్. ఇప్పటివరకు అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు రీజనల్ మార్కెట్ ని మాత్రమే పరిమితం అయ్యాయి. ఈసారి మాత్రం రీజనల్ సినిమా నుంచి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చెయ్యడానికి బన్నీ-త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ కాంబోలో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. పుష్ప 2 అయిపోగానే స్టార్ట్ అవ్వనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ జులై 3న బయటకి రానుందని సమాచారం. ఒకవేళ జులై 3 మిస్ అయినా ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యే లోపు అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ అవ్వడం గ్యారెంటీ.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?