Site icon NTV Telugu

Kishan Reddy : సమతుల్య బడ్జెట్​.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

G. Kishanreddy

G. Kishanreddy

కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్​ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్​ ప్రవేశపెట్టిందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈసందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ… దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని ఆయన తెలిపారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. సబ్ కే సాథ్ సబ్ కా వికాస్ లో భాగంగా.. -పేదలను శక్తివంతం చేయడం, అన్నదాత ఉత్పాదక సామర్థ్యాలను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని కిషన్‌ రెడ్డి అన్నారు.

Hamas: పాలస్తీనా కోసం ప్రత్యర్థి గ్రూపులతో చేతులు కలిపిన హమాస్.. బీజింగ్ వేదికగా ఒప్పందం..

పేదల కోసం: 1 కోటి పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చడానికి ₹ 10 లక్షల కోట్ల పెట్టుబడిని కేంద్రం బడ్జెట్​ లో ప్రతిపాదించింది.

యువత కోసం: 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్​ లో ప్రతిపాదనలు చేసింది.

అన్నదాతల కోసం : వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.5 లక్షల కోట్లు బడ్జెట్​ లో పెట్టాం.

మహిళల కోసం : మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేసింది మోదీ సర్కారు.

పన్ను చెల్లింపుదారుల కోసం : పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేలా.. పన్ను స్లాబ్‌లను మార్చింది. పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా 4 కోట్ల మందికి మేలు జరగనుంది.

Alleti Maheshwar Reddy : సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు

Exit mobile version