NTV Telugu Site icon

KIshan Reddy : అటవీ అనుమతుల నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైంది

Kishan Reddy

Kishan Reddy

ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం.. అటవీ అనుమతులు ఇవ్వడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సింగరేణి సంస్థకు కేటాయించిన ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అటవీ అనుమతుల నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైంది. 2015లోనే సింగరేణికి ఈ నైని బ్లాక్ కేటాయింపు జరిగినప్పటికీ.. వివిధ పాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఉత్పత్తి సాధ్యం కాలేదన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నైని బ్లాక్‌కు సంబంధించి ఒడిశా ప్రభుత్వంతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను. ఈ నేపథ్యంలో నైని బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన అవసరం, సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు.

ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం తాజా ఉత్తర్వులు విడుదల చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఒడిశా ముఖ్య మంత్రి శ్రీ మోహన్ మాంఝీ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నానని, ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వేగవతంగా నిర్ణయం తీసుకోవడంపై సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నానన్నారు. నైని బ్లాక్ లో సింగరేణి ఉత్పత్తిని ప్రారంభించిన తర్వాత.. తెలంగాణలో పవర్ సెక్యూరిటీకి (విద్యుత్ భద్రత) మరింత ఊతం లభిస్తుందనే విశ్వాసం నాకుందన్నారు కిషన్‌ రెడ్డి.