NTV Telugu Site icon

Kishan Reddy : జమ్మూకాశ్మీర్‌ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి ముందుకెళ్తాం

Kishanreddy

Kishanreddy

జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, గతంలో కంటే ఎక్కువ సీట్లు మరియు ఓట్లు పొందామన్నారు. జమ్మూ ప్రజలు మాతో ఉన్నారని మరోసారి నిరూపితమైందని, కాంగ్రెస్ ముక్త జమ్మూకాశ్మీర్ సాధనలో మేం విజయం సాధించామని కిషన్‌ రెడ్డి అన్నారు. కేంద్ర పార్టీ నాయకత్వ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో అన్ని స్థాయిల్లో కష్టపడి పనిచేశారన్నారు కిషన్‌ రెడ్డి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గతంలో ఎప్పుడు కూడా సంపాదించనన్ని ఎక్కువ సీట్లలో బీజేపీ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించిందని, ఇకపై జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి మరింత కష్టపడి పనిచేస్తామన్నారు.
Bhatti Vikramarka :ఈనెల 11న ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తాం

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధానమంత్రి మోడీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారని, మోడీపై ప్రజలకున్న విశ్వాసమేంటో.. జమ్మూకాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయన్నారు కిషన్‌ రెడ్డి. అంతేకాకుండా.. ప్రజలు చూపించిన విశ్వాసంతోనే.. జమ్మూ ప్రాంతంలోని 43 అసెంబ్లీ స్థానాల్లో.. బీజేపీ 29 స్థానాలు గెలుచుకుందన్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిందని ఆయన ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ముక్త జమ్మూను ప్రజలు ఈ ఎన్నికల ద్వారా మరొకసారి నిరూపించారన్నారు కిషన్‌ రెడ్డి.

Uddhav Thackeray: కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రకటించిన సీఎం అభ్యర్థికి శివసేన మద్దతు ఇస్తుంది..

Show comments