Site icon NTV Telugu

Kishan Reddy : రేపు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం…

Kishanreddy

Kishanreddy

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో.. రేపు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విస్తృతంగా అన్ని అసెంబ్లీల్లో కూడా.. పార్టీ జాతీయ నాయకత్వంతో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నామన్నారు కిషన్‌ రెడ్డి. రానున్న వారం రోజుల పాటు.. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్, హేమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్ వంటి జాతీయ నాయకులు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

Also Read : Reservation: “ప్రైవేటు రంగంలో 75 శాతం రిజర్వేషన్”.. వివాదాస్పద చట్టాన్ని కొట్టేసిన హైకోర్టు..

అంతేకాకుండా.. బహిరంగ సభలు నిర్వహిస్తున్నా.. ఇంటింటి ప్రచారాన్ని ఆపొద్దని పార్టీ అన్ని మండల శాఖలు, గ్రామశాఖలకు ఆదేశించారు. కేసీఆర్ పాలన వైఫల్యాలు, కుట్రల గురించి.. కాంగ్రెస్ మోసపూరిత హామీలు.. గతంలో చేసిన కుంభకోణాలు.. ప్రజలకు తెలియజేయాలని వారికి సూచించామని, ఎన్నికల మేనిఫెస్టో కూడా ఇంటింటికీ చేరేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు కిషన్‌ రెడ్డి. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని, ప్రజలు తీవ్రంగా ఉద్యమించి ఆ పార్టీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారన్నారు. చాలామంది ఉద్యమకారుల బలిదానంతో తెలంగాణ ఏర్పడిందన్నారు. ఎంతోమంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ అన్ని విధాలా అన్యాయం చేసిందన్నారు.

Also Read : Vijayashanti: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విజయశాంతి

Exit mobile version