రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల పథకాలను తీసుకొస్తున్నాయి. ఆ పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకి ప్రతి ఏటా రూ.6 వేలు బ్యాంక్ అకౌంట్‌లలో జమవుతూ వస్తాయి. దీనితో ఆర్థికంగా రైతులకు భరోసా కలుగుతుంది. మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తాయి. అంటే ఒక్కో విడత కింద రూ.2 వేలు బ్యాంక్ ఖాతాల్లో పడతాయి. ఇప్పటికే 9 విడతల డబ్బులు వచ్చాయి. ఇప్పుడు మరో విడత డబ్బులు అంటే పదో విడత డబ్బులు అందాల్సి ఉంది.
Also Read: హరిత నిధికి రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అయితే మరి ఇవి ఎప్పుడు పడతాయో ప్రస్తుతం స్పష్టత లేదు కానీ… పీఎం కిసాన్ 10వ విడత డబ్బులు డిసెంబర్ 15 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయని బ్యాంకు నిపుణులు తెలుపుతున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. డిసెంబర్ 15 నుంచి 25లోగా అందొచ్చని తాజా నివేదికలు ద్వారా తెలుస్తోంది. గతేడాది కూడా ఇదే సమయంలో అన్నదాతలకు పీఎం కిసాన్ డబ్బులు అందాయి.
