Kiran Abbavaram: 2019లో ‘రాజా వారు రాణి గారు’తో అరంగేట్రం చేసాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా సక్సస్ తర్వాత 2021లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ గ్రాండ్ కమర్షియల్ హిట్ కావటంతో ఒక్క సారిగా కిరణ్ అబ్బవరం పేరు మారుమ్రోగిపోయింది. కోవిడ్ తర్వాత థియేటర్ల కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన చిన్న సినిమాగా ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2022లో కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ ‘సెబాస్టియన్ పిసి 524’ లో రేచీకటి ఉన్న పోలీసు పాత్ర పోషించాడు కిరణ్. ఇది పరాజయం పొందినా నటుడుగా కిరణ్ కి పేరు తెచ్చింది. ఆ తరువాత మే 24, 2022న ‘సమ్మతమే’ విడుదలై యావరేజ్ టాక్ తో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను ఆకర్షించింది. అయితే ఈ ఏడాది వచ్చిన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ డిజాస్టర్‌గా నిలిచి కిరణ్ అబ్బవరం కెరీర్ కుదిపేసింది. దాంతో కిరణ్ ట్రోల్ కి కూడా గురయ్యాడు.
Dhanush: వేణు ఉడుగుల దర్శకత్వంలో ధనుష్!?
ఇక సినిమాల జయాపజయాలకు అతీతంగా కిరణ్ కెరీర్ కొనసాగుతోంది. ప్రస్తుతం కిరణ్ చేతిలో వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంతే కాదు పేరున్న పలు బ్రాండ్స్ కూడా సంప్రదించాయి. వారితో చర్చలు జరుగుతున్నాయట. మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, ఏఎమ్ రత్నం, ఏషియన్ సినిమాస్ వంటి బ్యానర్‌లతో సినిమాలు కమిట్ అయి ఉన్నాడు కిరణ్ అబ్బవరం. ఈ లైనప్ పరిశీలిస్తే 2023లో తన నుంచి మినిమమ్ 3, 4 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17, 2023న మహాశివరాత్రి కానుకగా కిరణ్ నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ముందుగా ఆడియన్స్ ముందుకు రానుంది. తగిలిన దెబ్బలను దృష్టిలో పెట్టుకుని కిరణ్ అబ్బవరం కెరీర్‌ని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళుతున్నట్లు అర్థం అవుతోంది. మరి కిరణ్ ప్లాన్ కి తగ్గట్లు వచ్చే ఏడాది అయినా వరుస విజయాలు పలకరిస్తాయేమో చూడాలి.