Site icon NTV Telugu

Kiran Abbavaram: నన్ను నమ్మండి.. ‘కె-ర్యాంప్‌’పై కిరణ్‌ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు!

Kiran Abbavaram

Kiran Abbavaram

కిరణ్‌ అబ్బవరం హీరోగా కొత్త దర్శకుడు జైన్స్‌ నాని తెరకెక్కించిన సినిమా ‘కె- ర్యాంప్‌’. ఈ సినిమాలో యుక్తీ తరేజా హీరోయిన్‌గా నటించారు. రాజేశ్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా ఈ చిత్రంను నిర్మించారు. నరేశ్, సాయి కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2025 దీపావళి సందర్భంగా ఈ నెల 18న కె- ర్యాంప్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీఐ ఆనంద్, విజయ్‌ కనకమేడల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రీరిలీజ్‌ వేడుకలో హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఒక్కరోజులోనే రూ.3330 పెరిగింది!

కేవలం వినోదం కోసమే తీసిన సినిమా కె- ర్యాంప్‌ అని, దీపావళి పండగ పూట కుటుంబంతో కలిసి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారని కిరణ్‌ అబ్బవరం హామీ ఇచ్చారు. టికెట్ కోసం పెట్టిన ప్రతీ రూపాయికి వినోదం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ సినిమా నవ్వించలేకపోతే తనను ఏమైనా అనవచ్చని సవాల్ విసిరారు. తనను నమ్మి సినిమా చుడండి అని, కడుపుబ్బా నవ్వుకుంటారని కిరణ్‌ చెప్పుకొచ్చారు. కె- ర్యాంప్‌ చిత్రానికి కచ్చితంగా సక్సెస్‌మీట్‌ పెడతాం అని కిరణ్‌ అబ్బవరం నమ్మకంగా చెప్పారు.

Exit mobile version