Site icon NTV Telugu

KA Movie OTT: కిరణ్ అబ్బవరం “క” ఓటిటి రిలీజ్ కి రెడీ

New Project (55)

New Project (55)

KA Movie : కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది.

Read Also:Nitish Reddy: నా ఆరాధ్య దైవం నుంచి క్యాప్ అందుకోవడం ఆనందంగా ఉంది: నితీశ్‌ రెడ్డి

పోటీలో రెండు భారీ సినిమాలతో పాటు రిలీజ్ అయినా కూడా ఈ సినిమా మంచి కంటెంట్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల విజయవంతంగా 5వ వారంలోకి అడుగుపెట్టిన ‘క’ రూ. 50 కోట్ల క్లబ్ లో చేరింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా క నిలవడమే కాకుండా ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది. కేవలం తెలుగులోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.

Read Also:Election Results 2024 Live UPDATES: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్..

ఇక నెమ్మదిగా పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ చిత్రం విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. ఇపుడు తెలుగులో ఓటిటి రిలీజ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు లేటెస్ట్ గా సినిమా రిలీజ్ పై హింట్ ఇస్తున్నారు. దీనితో అతి త్వరలోనే “క” ఓటిటిలో సందడి చేయనుంది అని పేర్కొన్నారు. అయితే ఈ వారమే లేదా వచ్చే వారం “క” ఓటిటిలోకి రావొచ్చు అని తెలిపారు. డేట్ పై మాత్రం తుది క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version