NTV Telugu Site icon

KA : రెండో రోజు కలెక్షన్లలో జోరు పెంచిన కిరణ్ అబ్బవరం ‘క’..

Ka Vidio

Ka Vidio

KA : యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఒక పీరియాడికల్ థ్రిల్లర్ చిత్రం కా (KA). ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ కథానాయికలు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. ‘క’ అనే సింగిల్ లెటర్‌తో పెట్టిన టైటిల్ విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేసింది. క‌థా చిత్ర క‌థ‌లోకి వ‌స్తే ఈ సోర్టీ 1977లో జ‌రిగింది. హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం అభిన‌య వాసుదేవ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. అభినయ వాసుదేవ్ అనాథ. అతని బాల్యం అంతా అనాథాశ్రమంలో గడిచిపోయింది. అయితే అతనికి ఇతరుల ఉత్తరాలు చదవడం అలవాటు.

Read Also:Char Dham Yatra: ముగింపు దశకు చార్‌ధామ్‌ యాత్ర.. ఈరోజు గంగోత్రి, రేపు యమునోత్రి మూసివేత

ఆ ఆసక్తితో పెద్దయ్యాక కృష్ణగిరి అనే మారుమూల గ్రామంలో పోస్ట్‌మ్యాన్‌గా కూడా చేరుతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో పోస్టాఫీసు హెడ్‌గా పనిచేస్తున్న రంగారావు కూతురు సత్యభామ (నయన్ సారిక)తో పరిచయం ఏర్పడుతుంది. కథ చాలా హ్యాపీగా సాగుతుండగా ఆ ఊరిలో అమ్మాయిలు కిడ్నాప్ అవుతారు. ఇతరుల ఉత్తరాలు చదివే వాసుదేవ్‌కు ఓ లేఖ ద్వారా అమ్మాయిల మిస్సింగ్ కేసుకు సంబంధించిన క్లూ దొరికింది. ఆ క్లూ ద్వారా మిస్టరీ కేసును ఎలా ఛేదిస్తాడు? ఈ క్రమంలో వాసుదేవ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు? ఇదీ ‘క’ సినిమా.

Read Also:CM Chandrababu: వడమాలపేట ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశాలు

అక్టోబర్ 30న ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ తో పండుగ నాడు అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. సెన్సేషనల్ ఓపెనింగ్ రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.6.18కోట్లు రాబట్టాడు. ఇక రెండో రోజు ఫస్ట్ రోజు కంటే మించి 6.93కోట్లను వసూలు చేసింది క మూవీ. రెండ్రోజులు కలిపి రూ.13.11కోట్లను వసూలు చేసింది. ఈ ఓపెనింగ్ కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళికి కేవలం తెలుగులో మాత్రమేవిడుదలైంది. రానున్న వారం తమిళ్, కన్నడ, మలయాళం, హింది బాషలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా హిట్లు లేక సతమతమవుతున్న కిరణ్ అబ్బవరానికి ‘క’ మంచి బూస్ట్ ఇచ్చింది.

Show comments