Kiran Abbavaram : డైరెక్టర్ గా మారుతున్న కిరణ్ అబ్బవరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క, కే రాంప్ సినిమాల హిట్స్ తో జోష్ మీదున్న ఈ హీరో ప్రస్తుతం సాయి రాజేష్ డైరెక్షన్ లో చెన్నై లవ్ స్టోరీ అని సినిమా చేస్తున్నాడు. అయితే కేవలం నటుడిగానే కాకుండా, కథలపై పట్టున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు దర్శకుడిగా పరిచయం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, కిరణ్ అబ్బవరం త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మే నెల నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం దర్శకత్వం వహించడమే కాకుండా, కిరణ్ ఈ కథపై చాలా కాలంగా వర్క్ చేస్తున్నారట. వైవిధ్యమైన కథాంశంతో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో కిరణ్ అబ్బవరం ఎక్కడా తగ్గడం లేదు. కొన్ని కీలక పాత్రల కోసం ప్రముఖ నటులు అరవింద్ స్వామి, కన్నడ వెర్సటైల్ యాక్టర్ రాజ్ బి. శెట్టి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కిరణ్ అనుకొన్నట్లుగా ఈ దిగ్గజ నటులు గనుక ప్రాజెక్ట్‌లో చేరితే, ఈ సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయం. కిరణ్ అబ్బవరం దర్శకుడిగా తన అదృష్టాన్ని ఎలా పరీక్షించుకుంటారో చూడాలి. మరోవైపు కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరించిన తిమ్మరాజు పల్లి టీవీ ఏప్రిల్ 17న రిలీజ్ కు రెడీ అయింది.
Also Read
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
తాజావార్తలు
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?