Site icon NTV Telugu

Kalki Collections : బాక్సాఫీస్‌కా బాస్… ఓన్లీ ప్రభాస్

Kalki 2898 Ad

Kalki 2898 Ad

కల్కి2898ఏడీ రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు ఓవర్ సీస్ లో అనేక రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికి విడుదలైన అన్నీ సెంటర్లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇతర ఇండస్ట్రీలు కలిపి దాదాపు రూ. 450 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కల్కి చిత్రం తన కలెక్షన్ల ప్రవాహంతో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో $16 మిలియన్లు వసూలు చేసి జవాన్, RRR రికార్డులను దాటి $20M వైపు పయనిస్తుంది. నార్త్ అమెరికా అల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన (నాన్ బాహుబలి -2) గా కొనసాగుతుంది. సోమవారం నాటికి కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్ల రాబట్టినట్టు వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మహా భారతంతో పాటు సైన్స్ ఫిక్షన్ కలగలిపి తెరకెక్కించిన విధానానికి, దర్శకుని విజన్ కు హ్యాట్సఫ్ చెప్తూ నాగ్ అశ్విన్ ను స్టార్ హీరోలు, పలు దర్శకులు అభినందించారు. తెలుగు సినిమా స్థాయిని పెంచడని కొనియాడారు.

కల్కి 2898 AD హిందీ మార్కెట్‌లో 200 Cr+ గ్రాస్‌తో మరో మైలురాయిని చేరుకుంది. అతి త్వరలో హిందీ వెర్షన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచిపోతుందని భావిస్తున్నారు. కాగా సెకండ్ పార్ట్ పై ఇప్పటినుండే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కల్కి -2లో ఇంకెంత మంది స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు, ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నారోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా కల్కి -2కు సంబంధించి ఇప్పటివరకు 20శాతం మాత్రమే షూట్ చేశామని నాగ్ అశ్విన్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో తేలిపారు.

Exit mobile version