Virat Kohli: టీమిండియా క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో ఢిల్లీ తరఫున ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో లిస్ట్-A క్రికెట్‌లో 16,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఇది భారత్ నుంచి సచిన్ టెండుల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
Vijay Hazare Trophy: సెంచరీతో రోహిత్ శర్మ ఊచకోత.. ముంబై భారీ విజయం..!
కోహ్లీ ఈ మైలురాయిని కేవలం 343 మ్యాచ్‌లు (330 ఇన్నింగ్స్‌లు)లోనే చేరుకున్నాడు. ఇది సచిన్ టెండుల్కర్ (391 ఇన్నింగ్స్‌లు) కంటే చాలా వేగవంతమైనది. అంతేకాదు లిస్ట్-Aలో 10,000 నుంచి 16,000 పరుగుల వరకు ప్రతి 1,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరిన రికార్డు కూడా కోహ్లీదే. 16,000 పరుగులు చేసిన ఆటగాళ్లలో అతని యావరేజ్ 57.34తో అత్యధికం.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ కోహ్లీకి ప్రత్యేకమైనది. 15 సంవత్సరాల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతూ.. ఛేజింగ్‌లో తొలి పరుగుతోనే ఈ మైలురాయిని తాకాడు.కోహ్లీ లిస్ట్-A కెరీర్ దాదాపు 20 సంవత్సరాలుగా సాగుతోంది. 2006లో ఢిల్లీ తరఫున డెబ్యూ చేసిన అతను ఈ ఫార్మాట్‌లో ఎప్పటికప్పుడు తన ఆధిపత్యం చూపిస్తూనే ఉన్నాడు.
𝗠𝗮𝗷𝗼𝗿 𝗺𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲! 🫡
Yet another record to Virat Kohli's name, en route to a fabulous century for Delhi against Andhra in the Vijay Hazare Trophy 👏🔝#VijayHazareTrophy | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/UG1GHytMuC
— BCCI Domestic (@BCCIdomestic) December 24, 2025
