NTV Telugu Site icon

Sanke Man: ఎక్కడినుంచొస్తారో వీళ్లంతా.. పాములతో ఆ చేష్టలేందిరయ్య

King Cobra

King Cobra

Sanke Man: పాము పేరు వింటేనే భయంతో దూరంగా పారిపోతాము. పాముల్లో అత్యంత ప్రమాదకరమైన పాము కింగ్ కోబ్రానే. దాని ప్రస్తావన వస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది.. ఆ పేరు వింటేనే భయపడిపోతారు. ఈ రోజుల్లో కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో ఒకటి రెండు కాదు చాలా కింగ్ కోబ్రాస్ కనిపిస్తున్నాయి. వీటితో ఒక వ్యక్తి వింత పనులు చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన జనాలు చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో, ఒక వ్యక్తి .. ఒకటి లేదా రెండు కాదు, 5 కింగ్ కోబ్రాస్ ఉన్నట్లు చూడవచ్చు. ప్రమాదకరమైన ఈ పాములకు భయపడకుండా వాటితో వికృత చేష్టలు చేయిస్తున్నాడు. వీడియో చూసిన తర్వాత మీకు గూస్‌బంప్స్ రావడం ఖాయం. అంతే కాదు ఒక్కొక్క కింగ్ కోబ్రాను తన చేతుల్లోకి తీసుకోవడం వీడియోలో కనిపిస్తుంది.

Read Also:Facebook: ఫేస్‌బుక్ లైవ్ పెట్టి.. ఉరేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని

ఆ వ్యక్తి తన చేతుల్లోకి కింగ్ కోబ్రాను ఎత్తుకుని ముద్దు పెట్టుకోవడం కూడా వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో Instagram ఖాతా @earth.reel నుండి షేర్ చేయబడింది. వీడియోతో పాటు వ్యక్తి చర్యపై మీ అభిప్రాయం ఏమిటి అని వినియోగదారు అడిగారు. ఈ వీడియోపై జనాలు చాలా రియాక్షన్స్ ఇచ్చారు. నాగుపాముతో ఎవరైనా ఇలాంటి పని ఎలా చేస్తారని సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నిస్తున్నారు. దీన్ని మూర్ఖత్వంగా అభివర్ణిస్తూ.. ఇలాంటి పని ఎవరూ చేయవద్దని కొందరు యూజర్లు అన్నారు.

Read Also:Megastar: మెగా టీజర్ లాంచ్ కి గ్రాండ్ ఈవెంట్…