King Charles III: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను USAలో 51వ రాష్ట్రంగా కలిపేసేందుకు చేస్తున్న బెదిరింపుల నడుమ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III ఓటావాలో పార్లమెంటు ప్రారంభ సభలో తన కీలక ప్రసంగంలో కెనడాను శక్తివంతమైన, స్వతంత్ర దేశంగా ప్రశంసించారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ఆహ్వానంతో దేశాధిపతిగా హాజరైన చార్లెస్, మారుతున్న అంతర్జాతీయ సంబంధాలు.. అలాగే ముఖ్యంగా అమెరికాతో ఉన్న సంబంధాలపై కామెంట్లు చేసారు.
Read Also: Chandigarh: 1,700కు పైగా గర్భస్రావ కిట్లు స్వాధీనం.. ఎఫ్ఐఆర్ నమోదు..!
ప్రజాస్వామ్యం, చట్టాల పరిపాలన, స్వయంప్రతిపత్తి, స్వేచ్ఛ ఇవన్నీ కెనడియన్లు ఎంతో విలువగా భావించే అంశాలు. వీటిని కాపాడడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. కెనడా ఇప్పుడు ఒక కీలక సమయంలో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. “ది ట్రూ నార్త్ ఈజ్ ఇండీడ్ స్ట్రాంగ్ అండ్ ఫ్రీ” (కెనడా జాతీయ గీతంలో ఉన్న ఒక లైన్) చెప్పిన రాజు, కెనడా దేశ స్వతంత్రత ఎలాంటిదో స్పష్టం చేశారు. ట్రంప్ కెనడాను అమెరికాకు అనుసంధానించాలన్న అనేక బెదిరింపులకు రాజు నేరుగా స్పందించలేదు. కానీ, ఈ ప్రసంగం మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలతో ఉద్దేశిత సంకేతాలు పంపారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే ‘ఒకే ఒక్కడు’!
అలాగే బ్రిటన్ రాజు గ్లోబల్ వాణిజ్యంపై ఆందోళన చెందారు. సంపదను అందించిన ఓపెన్ గ్లోబల్ ట్రేడ్ వ్యవస్థ మారుతోంది. ఇది పరిపూర్ణం కాకపోయినా, గత కొన్నేళ్లుగా కెనడియన్లకు అభివృద్ధిని తెచ్చింది అని అన్నారు. ప్రపంచం ఇప్పుడు ఇది వరకు కాలం కంటే మరింత ప్రమాదకరంగా, అనిశ్చితంగా మారిందని ఆయన హెచ్చరించారు. కెనడా పార్లమెంటు ప్రారంభోత్సవంలో బ్రిటిష్ రాజు హాజరవడం 70 ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారి. పార్లమెంటు మరమ్మతుల దశలో ఉండగా, ఓటావాలోని పాత రైల్వే స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాన మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తాత్కాలిక అధికారి పక్ష నేతలు, స్థానిక ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
