Site icon NTV Telugu

Kim Wife: కిమ్ మాత్రమే కాదు.. ఆయన భార్య ఏం చేసినా సంచలనమే

Kim Wife

Kim Wife

Kim Wife: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఏం చేసినా సంచలనమే.. ఇటీవల ఆయన అనారోగ్యంతో చనిపోయాడంటూ ప్రచారం జరిగింది. అందుకే కనిపించడం లేదన్నారు. అనుమానాలకు స్వస్తి పలుకుతూ ప్యోంగ్యాంగ్‌లో బుధవారం రాత్రి ఆర్మీ నిర్వహించిన పరేడ్‌లో కిమ్ తన భార్య, కుమార్తెతో కలిసి పాల్గొన్నాడు. మిల‌ట‌రీ విందుకు కిమ్ భార్య రీ సోల్ జూ, ఆయన కుమార్తె జూ యే కూడా హాజరయ్యారు. కిమ్ పై పుకార్లు రావడానికి కారణం కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన హాజరుకాకపోవడంతో రకరకాల పుకార్లు షికారు చేశాయి. ఏకంగా అమెరికాలోని ఓ ప్రముఖ మీడియా సంస్థ కిమ్ ఆరోగ్యం అత్యంత విషమం అంటూ ఓ కథనం కూడా ప్రసారం చేసింది. ప్రస్తుతం ఆ ప్రచారాలన్నింటికీ పుల్ స్టాప్ పెట్టేశారు.

Read Also: Indian Solder: ఇండియన్ సోల్జర్‎ను ముద్దాడిన టర్కీష్ మహిళ

బాంక్వెట్‌కు .. కిమ్ తన ఫ్యామిలీతో విందుకు హాజరయ్యారు. కిమ్ కూతురు జూ యే..భార్య రీ సోల్ జూ కూడా విందులో పాల్గొన్నారు. ఈ విందుకు రి సోల్-జు ధరించిన నెక్లెస్, కిమ్ కుమార్తె ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కిమ్ జోంగ్ ఉన్ భార్య క్షిపణి నెక్లెస్ పెండెంట్ ను ధరించి కనిపించింది. అణు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రదర్శించే పరేడ్‌ను కిమ్ పర్యవేక్షించారు. కిమ్ ఫ్యామిలీ విందులో పాల్గొన్న ఫోటోలను రోడాంగ్ సిన్మున్ పత్రిక ప్రచురించింది. వేడుకల్లో బాంక్వెట్‌లో టేబుల్ సెంట‌ర్ సీటులో కిమ్ త‌న కూతుర్ని కూర్చోబెట్టారు. దీంతో ఆమె దేశానికి భవిష్యత్ నాయకురాలు అనే ఊహాగానాలకు ఊపిరి పోసినట్లు అయింది. మిలిట‌రీ ఈవెంట్‌కు కూతుర్ని తీసుకువ‌చ్చి.. రాచ‌రిక పాల‌న సంకేతాన్నీ కిమ్ ఇచ్చాడంటూ నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి కిమ్ తన కుటుంబంతో కలిసి బయట కనిపించడం అరుదు.

Exit mobile version