NTV Telugu Site icon

North Korea: రెచ్చగొడితే అణుదాడి తప్పదు.. ఇక మీ ఇష్టం..

Kim Jong Un

Kim Jong Un

ఉత్తర కొరియాను అణుదాడితో రెచ్చగొడితే తాము కూడా అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి (icbm) ప్రయోగం మాక్ డ్రిల్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా సైనికులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నారు. మాక్ డ్రిల్‌కు హాజరైన సైనికులను ఉద్దేశించి ఉత్తర కొరియా అధ్యక్షుడు మాట్లాడుతూ.. అణుదాడి హెచ్చరికలు చేసినట్టు ఉత్తరకొరియా వార్తా సంస్థ ఓ కథను ప్రసారం చేసింది. ప్రత్యర్థులు అణుబాంబులతో తామను రెచ్చగొడితే సంకోచించకుండా అణు బాంబు ప్రయోగించాలని మిసైల్ బ్యూరోకు కిమ్ జొంగ్ ఉన్ సూచించినట్టు తెలిపింది. ఈ చర్చల్లో బేషరతుగా పాల్గొనాలంటూ దక్షిణ కొరియా, దాని మిత్రదేశాలు కిమ్‌ను కోరిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఈ హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పాడింది.

Read Also: Vijayawada Medical Student: అమెరికాలో విజయవాడ వైద్య విద్యార్థిని మృతి!

అయితే, గతవారం వాషింగ్టన్ డీసీలో అమెరికా, దక్షిణ కొరియా మధ్య కీలక సమావేశం కొనసాగింది. ఉత్తర కొరియాతో యుద్ధం తలెత్తిన పక్షంలో అణుబాంబు ప్రయోగ నివారణకు ఏం చేయాలనే దానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. కాగా, ఉత్తర కొరియా తమపై అణుబాంబు ప్రయోగిస్తే కిమ్ పాలన అంతమైపోతుందని ఉభయ దేశాలూ ఈ భేటీ తర్వాత హాట్ ఘాటు విమర్శలు చేశారు. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా శాంతి చర్చల్లో కిమ్ జొన్ ఉన్ పాల్గొనాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడి హెచ్చరికలకు ప్రాధాన్యత సంతరించుకుంది.