NTV Telugu Site icon

North Korea: మాకు యుద్ధం చేసే ఉద్దేశం లేదు.. కానీ, దక్షిణ కొరియాతో ఏకీకరణ సాధ్యం కాదు..

Kim Jong Un

Kim Jong Un

Kim Jong Un: దక్షిణ కొరియాతో సయోధ్య మరియు పునరేకీకరణను ప్రోత్సహించే అనేక ప్రభుత్వ సంస్థలను ఉత్తర కొరియా కూల్చివేసింది. తమ దేశం యుద్ధాన్ని తప్పించుకోకూడదని కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా పార్లమెంట్ అయిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ కొరియాతో ఇకపై ఏకీకరణ సాధ్యం కాదని అన్నారు. దక్షిణ కొరియాను ప్రత్యేక ‘శత్రువు దేశం’గా మార్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని పిలుపునిచ్చారు.

Read Also: High Tension at Nandigama: నందిగామలో తీవ్ర ఉద్రిక్తత..

అయితే, సౌత్- నార్త్ కొరియా దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు శాంతియుత పునరేకీకరణ కమిటీ, నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ బ్యూరోతో పాటు ఇంటర్నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషన్ అనే మూడు సంస్థలు మూసివేయబడతాయని సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రకటన విడుదల చేశాడు. ప్యోంగ్యాంగ్ ఇటీవల నిర్వహించిన క్షిపణి పరీక్షల పరంపర తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.

Read Also: Filmfare Awards 2024 nominees: ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు ఏకంగా 19 నామినేషన్లు.. షారుక్ ఖాన్ రెండు సినిమాలు..

ఇక, తమ దేశాన్ని ‘శత్రువు’గా భావించే ఉత్తర కొరియా చర్యను దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ ఇవాళ విమర్శించారు. ఇది ప్యోంగ్యాంగ్ యొక్క ‘జాతీయ వ్యతిరేకతో పాటు చారిత్రాత్మక స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. అయితే, హ్వాసాంగ్-18 ఇంధన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన వారాల తర్వాత, హైపర్‌సోనిక్ వార్‌హెడ్‌తో కూడిన కొత్త క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా సోమవారం ప్రకటించింది. మరోవైపు జపాన్, దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలను ముమ్మరం చేశాయి. ఆయుధ పరీక్షలకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో జరిగే దాడికి రిహార్సల్‌గా ప్యోంగ్యాంగ్ తన శక్తిని చూపిస్తుంది.