వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలకు పాల్పడుతుంది. పాఠశాలకు వెళ్లే బాలికలను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి.. వారిపై అత్యాచారాలు చేయిస్తుంది. ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ ఘోరాలు బయటపడ్డాయి. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కేసు కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న (14) బాలికకు మాయ మాటలు చెప్పి ల్యాదెల్ల ప్రాంతానికి చెందిన నవ్య అనే(20) యువతి తీసుకెళ్లింది. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల అనంతరం యువతి వద్ద 9వ తరగతి విద్యార్థి బందీగా ఉన్నట్లు పోలీసులు ఆచూకీ కనుక్కున్నారు.
Read Also: Pawan Kalyan : ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టద్దుః పవన్ కల్యాణ్
హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన కిలాడీ లేడీ కొంతకాలంగా వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటుంది. డ్రగ్స్‌కు బానిసైన ఆ లేడీ.. తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠా ఏర్పాటు చేసుకుంది. పాఠశాల బాలికలే లక్ష్యంగా కిలాడీ లేడీ వరంగల్‌లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహించి.. పాఠశాలకు వెళ్లి వచ్చే సమయాల్లో బాలికలకు మాయమాటలు చెప్పి ఎంపిక చేసుకుంటారు. అనంతరం కిడ్నాప్ చేసి.. బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి, అప్పటికే తన గ్యాంగ్‌కు టచ్‌లో ఉన్న మానవ మృగాలకు విద్యార్థినులను అప్పగిస్తుంది.
Read Also: Astrology: మార్చి 15, శనివారం దినఫలాలు
అనంతరం.. ఆ కిలాడీ లేడీకి మానవ మృగాలు డబ్బు ఇస్తారు. బాలికలు మత్తులో ఉండగా వారిపై అత్యాచారాలకు పాల్పడుతారు. ఏడాదిన్నరగా బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలతో విద్యార్థిని తీసుకెళ్లిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయికి అలవాటు పడ్డ నిందితురాలు గతంలోను ఇద్దరు చిన్నారులను మాయ మాటలతో తీసుకెళ్లినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడి అయింది. కాగా.. ఈ ఘటనపై మిల్స్ కాలని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.