Site icon NTV Telugu

Kieron Pollard: 6,6,0,6,6,6,6,6 .. 8 బంతుల్లో 7 సిక్సర్లు.. మాజీ ఆల్‌రౌండర్ ఊచకోత!

Pollard

Pollard

Kieron Pollard: ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో (CPL 2025) వెటరన్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తన పవర్ హిట్టింగ్‌తో మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా, వివిధ దేశాలలో జరిగే T20 లీగ్‌లలో మాత్రం తన క్రికెట్ నైపుణ్యాన్ని కొనసాగిస్తున్నాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సెంట్ కిట్స్ అండ్ నీవిస్ పేట్రియట్స్ బౌలర్లు పొలార్డ్ విరాబాదుడికి బలయ్యారు.

US-Venezuela: కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా దాడి.. 11 మంది మృతి

ఆరంభంలో 13 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి కష్టపడుతున్నట్టే కనిపించిన పొలార్డ్, ఆ తర్వాత 15వ ఓవర్ నుంచి గేర్ మార్చి తన ధనాధన్ మోడ్‌లోకి మారాడు. స్పిన్నర్ నవీన్ బిడైసీపై మూడో బంతికి భారీ సిక్స్‌తో మొదలెట్టిన పొలార్డ్, అదే ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఆ తరువాత ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన వక్వార్ సలామ్‌ ఖైల్పై పొలార్డ్ ఏకంగా నాలుగు వరుస సిక్సర్లు బాదేశాడు. అలా 8 బంతుల్లో 7 సిక్సర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.

Hyderabad Metro: మెట్రో రైలులో గుండె, ఊపిరితిత్తుల తరలింపు.. 45 నిమిషాల్లోనే 2 ఆస్పత్రులకు!

చివరికి పొలార్డ్ 29 బంతుల్లోనే 65 పరుగులు చేసి, తన జట్టు ట్రిన్బాగో నైట్ రైడర్స్ కు 12 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో జట్టు CPL 2025 పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ప్రస్తుతం పోలార్డ్ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన చాలామంది క్రికెట్ ప్రేమికులు 2022లో పొలార్డ్ రిటైర్మెంట్ నిర్ణయం కొంచెం తొందరపాటు అని కామెంట్ చేస్తున్నారు.

https://twitter.com/Monish09cric/status/1962713077037834613

Exit mobile version