NTV Telugu Site icon

Viral Video: లేడీ ఫ్యాన్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పోలార్డ్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

Kieron Pollard Female Fan

Kieron Pollard Female Fan

Kieron Pollard apologizes to Female Fan: వెటరన్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ ఓ లేడీ ఫ్యాన్‌కు క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు ఆటోగ్రాఫ్ చేసిన తన క్యాప్‌ను ఆమెకు బహుమతిగా అందించాడు. ఈ ఘటన అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. లేడీ ఫ్యాన్‌తో ఓపికగా మాట్లాడి, ఆమెకు సెల్ఫీ ఇచ్చినందుకు పొలార్డ్‌పై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?.

మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా సోమవారం లాస్ ఏంజెల్స్‌ నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ కీరన్ పోలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. అయితే నైట్‌రైడర్స్‌ బౌలర్‌ స్పెన్సర్ జాన్సన్ 15వ ఓవర్‌ వేయగా.. పోలార్డ్ కొట్టిన ఓ సిక్సర్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ముంబై లేడీ ఫ్యాన్‌ను బలంగా తాకింది. బంతి ఆమె భుజానికి బలంగా తాకడంతో కాసేపు నొప్పితో విలవిల్లాడిపోయింది.

విషయం తెలుసుకున్న కీరన్ పోలార్డ్ మ్యాచ్ అనంతరం ఆ లేడీ ఫ్యాన్‌ దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. గాయం ఎలా ఉందని ఆరా తీశాడు. పోలార్డ్ క్షమాపణలకు పర్లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆటోగ్రాఫ్‌ చేసిన తన క్యాప్‌ను ముంబై కెప్టెన్ బహుమతిగా ఇచ్చాడు. ఆమె తన భర్తను పరిచయం చేయగా.. జాగ్రత్తగా చూసుకోవాలని పోలార్డ్ చెప్పాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

Show comments